కరోనా తో ప్రపంచం అల్లకల్లోలం అయ్యిపోతోంది. ఎక్కడ చూసిన కరోనా బాధిస్తూనే ఉంది. అయితే ఆ వైరస్ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అని ఇప్పటికే అనుభవిస్తున్న దుస్థితి. సమస్త ప్రపంచం ఈ కరోనా తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చైనా, ఇటలీ , స్పెయిన్ , అమెరికా వంటి దేశాల్లో జనం శవాలై కుప్ప కూలిపోతున్నారు .

 

 

పూడ్చడానికి చోటు లేక శవాలతో రోదిస్తున్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉన్నారు . భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంది . వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. అలానే కార్మికులు, కూలీలు వారి ఉపాధిని కోల్పోయారు .

 

 

తాజా లెక్కల్లో తెలిసింది ఏమిటి అంటే దాదాపు 2 కోట్ల మంది జనం ఇప్పటికే వారి ఉద్యోగాలు కోల్పోయారట . అయితే ఈ ప్రజల్ని వారి ఆదుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు గాను అమెరికా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

 

 

వారి  ప్రజలకి ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడానికి ట్రంప్ ప్రభుత్వం ముందుకి వచ్చిందట. వీరు సుమారు రెండు ట్రిలియన్ల డాలర్లు ఈ ప్యాకేజి లో ఇవ్వడానికి సిద్ధం అయ్యారట . ఇందుకు యుఎస్ సెనేట్, వైట్ హౌస్ టీమ్ కూడా అంగీకరించారట. అమెరికా లో ఇటువంటిది జరిగినట్టు చరిత్రలో లేకపోవడం విశేషం.

 

 

అయితే ఈ ప్యాకేజి లో భాగంగా రూ . 91 వేలు అందుకోనున్నారు. అలానే పిల్లలకి 500 డాలర్లు ఇస్తారట. ఇదే ఆధునిక అమెరికా చరిత్రలో అతి పెద్ద ఉద్దీపన ఫ్యాకేజి అని చెబుతున్నారు . వారి  ప్రజలకి ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వడానికి ట్రంప్ ప్రభుత్వం ముందుకి వచ్చిందట.  జనం కోసం ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: