ప్రపంచ దేశాలను మహమ్మారి కరోనా వైరస్ ఎంత బెంబేలెత్తిస్తున్నదో  చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ చైనా దేశంలోని ఉహన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో చైనాలోని ఊహ నగరంలో మొదట గుర్తించబడిన ఈ మహమ్మారి వైరస్ క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా ప్రబలుతుంది. ఇక ఈ వైరస్ వుహాన్ నగరంలో మరణ మృదంగం మోగించింది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అప్రమత్తం అయిన చైనా ప్రభుత్వం.. వుహాన్  మొత్తం నిర్బంధాన్ని ప్రకటించింది. ఎవరు బయటకు రాకూడదు అంటూ కఠిన నిబంధనలను అమలు చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలపాటు వుహాన్  నగరంలో లాక్ డౌన్  విధించడంతో...అక్కడ  విలయ తాండవం చేస్తూ ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న కరోనా  వైరస్ కాస్త కనుమరుగు అవుతూ వచ్చింది. 

 

 ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత ఊహ నగరంలో ఆంక్షలను ఎత్తివేసింది ప్రభుత్వం. శనివారం వుహాన్  నగరంలో సిటీ బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కానీ షరతులు వర్తిస్తాయి అని తెలిపింది . కేవలం సిటీ బస్సుల్లో నగరంలో తిరిగేందుకు  మాత్రమే అనుమతి ఇచ్చిన చైనా ప్రభుత్వం సిటీ దాటి వెళ్లేందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్థానిక లందరూ రెచ్చిపోయారు. కొన్ని నెలల పాటు నిర్బంధం విధించిన తర్వాత సిటీ బస్సు, మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతించిన ప్రభుత్వం... నగరం దాటి వెళ్ళకూడదు అని మాత్రం చెప్పడం దారుణం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  

 

 

 ఇంకేముంది చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. వుహన్ నగరంలోని హుబె ప్రావిన్స్ లో  ఏకంగా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు స్థానికులు. ఇక స్థానికులు అందరూ కలిసి ఆ వాహనాన్ని బోల్తా కొట్టింది మరి భీభత్సం సృష్టిస్తూ  ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే నిరసనకారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు వారిపై లాఠీ ప్రతాపం చూపించక తప్పలేదు. అయితే స్థానికులను హుబె  ప్రావిన్స్ నుంచి జియాంగ్టి లోకి  అనుమతించకపోవడంతో నే అసలు సమస్య మొదలైంది అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే కరోనా  వైరస్ ప్రభావం తగ్గి అంతా  ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న తరుణంలో అధికారులు స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం మరోసారి ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: