ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయి ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకు వెళ్ళలేక ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు సీఎం వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామ వాలంటీర్ల వెంట వెళ్లి ప్రతి ఇంటికి ఈ వెయ్యి రూపాయల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసిపి పార్టీని గెలిపించాలని కోరినట్లు వార్తలు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం జరిగాయి.

 

దీంతో అప్పట్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన టైములో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్రస్థాయిలో చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్నారు ఏమో తెలియదు గానీ తాజాగా ఈ ఘటననీ నిమ్మగడ్డ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీంతో ఎన్నికలు వాయిదా వేసి ఎన్నికల కోడ్ ఎత్తేసిన న్యాయస్థానం అప్పటికి తీర్పు ఇచ్చిన టైంలో ఎన్నికల ప్రచారం ఎవరు చేయకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

 

అయితే తాజాగా ₹1000 ఇచ్చిన టైమ్ లో వైసీపీ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహం చూపించటంతో ఎప్పటినుండో ఛాన్స్ కోసం చూస్తున్నా ఎన్నికల కమిషనర్ కి జగన్ జుట్టు దొరికినట్లే అయ్యింది. వెంటనే ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతి జిల్లా కలెక్టర్ కి వచ్చిన ఈ ఎన్నికల ప్రచారం వార్త గురించి ఎన్నికల నియమావళి లెక్కచేయకుండా ఎవరెవరు పాల్గొన్నారో వారి వివరాలు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: