ఎంతోమంది ముఖాలపై నవ్వు  మెరిసేలా చేసి... నవ్వు కు  ప్రతిరూపంగా మారిన వ్యక్తి చార్లీ చాప్లిన్. ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన హాస్య కారుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చార్లీచాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. తల్లిదండ్రుల నుంచి నటనను పుణికిపుచ్చుకున్న చార్లీ చాప్లిన్... నాట్యం, చతురత , ముఖం కదలికలతో ఎలాంటి డైలాగులు లేకుండా హాస్యాన్ని పండించిన గొప్ప వ్యక్తి.చార్లీ చాప్లిన్  ప్రపంచ అద్భుతాలలో  ఒకడు అని చెప్పవచ్చు . నవ్వుకు ప్రతి రూపంగా చార్లీ చాప్లిన్ ఎంతో మంది ని  కడుపుబ్బా నవ్వించాడు. 

 

 

చార్లీ చాప్లిన్ తండ్రికి  తాగుడు  అలవాటు ఉండటంతో సంపాదన  మొత్తాన్ని తన తండ్రి తాగుడికి వెచ్చించేవాడు దీంతో చార్లీ చాప్లిన్  బాల్యం కటిక పేదరికంలో  గడిచింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాస్య నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చార్లీ చాప్లిన్ కనీసం తినడానికి తిండి లేని స్థితిని  కూడా చూశాడు. తాగుడుకు బానిసైన తండ్రి కొన్నాళ్ళకి   కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చార్లీ చాప్లిన్ తల్లి పిల్లలను  ఎంతో బాధ్యతగా అష్టకష్టాలు పడి పేదరికంలోనే పిల్లలకు కష్టం తెలీకుండా పెంచారూ . ఇక చార్లీ చాప్లిన్ చిన్నప్పటినుంచి తనదైన నాట్యం చతురత హావ భావాలతో కూడిన హాస్యోక్తితో ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించాడు .

 

 

 పేదరికం లో ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ ముఖం మీద చిరునవ్వు మాత్రం చేరగకుండా కడుపుబ్బ నవ్వించాడు చార్లీ చాప్లిన్. మూగ  చిత్రాలకు చక్రవర్తి గా ఓ వెలుగు వెలిగాడు. అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలు. హావభావాలను ముఖ కవళికలను భంగిమలను సృష్టించాడు చార్లీ చాప్లిన్ . చార్లీ చాప్లిన్ ను కాపీ కొట్టడానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ...తన  వేషధారణలో ఎంతోమంది అనుకరించినప్పటికీ ఎవరికీ అంతటి గుర్తింపు రాలేదు.గొప్ప  అందగాడైన చార్లీ చాప్లిన్ తన రూపాన్ని మొత్తం మార్చుకొని ఎంతో మంది సినీ ప్రేక్షకులను మైమరిపించింది నవ్వించాడు  చేసేవాడు. అతడు దేశ దేశాల వారిని వయోభేదం మత వర్గ భేదం లేకుండా ఎంతగానో నవ్వించాడు. బాధాకరమైన ప్రపంచంలో అందరిలో హాస్య జ్యోతిని గెలిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: