గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం రెడ్ జోన్ లో ఉందంటూ వచ్చిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ మద్య తాడేపల్లి పాత గేట్ సమీపంలో ఉన్న మారుతి అపార్టుమెంటులో ఓ వృద్ధురాలు చనిపోయారు. దాంతో ఇక్కడ ఏరియా రెడ్ జోన్ లోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. చనిపోయిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా... కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే  ఆమె ఉంటున్న అపార్టుమెంట్ జగన్ నివాసానికి కూతవేటు దూరంలోనే ఉంది.

 

దాంతో సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.  ఈ వార్తలపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ స్పందించారు. అంతే కాదు ఇలాంటి రూమర్లు పట్టించుకోవద్దని.. సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందనే వార్తలను ఖండించారు.  సీఎం నివాసం రెడ్ జోన్ లో ఉందనే వార్తలను ఖండించారు. అయితే    నాలుగు ఐదు పాజిటీవ్ కేసులు ఉంటేనే రెడ్ జోన్ గా పరిగణిస్తారని అన్నారు. అయితే  తాడేపల్లిలో కేవలం ఒక్క కేసు మాత్రమే ఉన్నందున రెడ్ జోన్ పరిధిలోకి రాదని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: