కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యాల లో అయితే మరణ మృదంగం మోగిస్తూ విలయతాండవం చేస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయం ఉన్నప్పటికీ కూడా అగ్రరాజ్యాలు కరోనా వైరస్ పై పోరాడలేక చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా జపాన్  ఇరాన్ లాంటి దేశాల్లో అయితే ఈ మహమ్మారి వైరస్ మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే పేద దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియా లో కూడా పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. అక్కడ కరోనా  వైరస్ విజృంభణ జరగక పోయినప్పటికీ... కరోనా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉత్తర కొరియాలో దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ తీవ్ర అనారోగ్యంతో వున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఉత్తర కొరియా పరిస్థితి కూడా రోజురోజుకు దీనంగా మారిపోతుందని కనీసం అక్కడి ప్రజలకు నిత్య అవసరాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది అంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

 

 

 దేశంలో  కరోనా వైరస్ కట్టడి చేయడంలో భాగంగా నిత్యావసరాల కొనుగోళ్లపై కూడా కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం . అయితే మొదట కూరగాయలు పండ్లు దిగుమతిపై ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం తర్వాత వాటిని ఇతర నిత్యావసరాలను కూడా పొడిగించినట్లు... ప్యాంకాంగ్ లోని ప్రజలు చెప్పినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచ పేద దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియా... ఆహారధాన్యాల కొరత ఏర్పడటం సర్వ సాధారణమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆహారధాన్యాల కొరత అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 

 

 మొన్నటి వరకు చైనా దేశంలో కరోనా  వైరస్ తగ్గుముఖం పట్టగా సరిహద్దులను తెరిచినా ఉత్తర కొరియా... మళ్ళీ అక్కడ కరోనా పెరుగుతుండటంతో  అక్కడి సరిహద్దులను సరిహద్దులను మూసి వేసింది  . ఇక తమ దేశంలో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కూడా లేదు అంటూ ప్రకటించింది. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కోమాలోకి వెళ్లిపోయారు అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురితం చేస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఉత్తర కొరియా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. అటు ఉత్తరకొరియా మీడియా సైతం ఈ విషయంపై మౌనంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే దానిపై మాత్రం ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన సమాచారం చాలా తక్కువే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: