ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు తమ ప్రతిభను చాటుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కొంత మంది కొత్త దర్శకులు కూడా తమ ప్రతిభను చాటుతూ చిన్న చిన్న సినిమాలతోనే మంచి విషయాలను అనుకుంటున్నారు. మరి కొంతమంది పెద్ద దర్శకులు భారీ బడ్జెట్ సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్నారు. ఇలా ఎవరి ప్రతిభను వారు  చాటుతూ చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్నారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎప్పుడైతే విజయం సాధించలేకపోతే అప్పుడు వేరే మార్గం ద్వారా పాపులారిటీ సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నవారు  ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చిత్ర పరిశ్రమల్లో చాలా వెనక్కి వెళ్లి పోయినప్పుడు మళ్లీ తెర మీదికి రావాలంటే ఏదో ఒక విషయాన్ని లేదా ఏదో ఒక పెద్ద సెలబ్రిటీ ని టార్గెట్ గా చేసుకుంటే సరిపోతుంది అనే భావన ప్రస్తుతం చాలా మందిలో ఉంది.

 

 తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటన జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి వివాదాల్లో తలదూర్చాడు  అన్న విషయం తెలిసిందే. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు ఎంతో హంబుల్గా ఎవరు నొచ్చుకోకుండా మాట్లాడుతాడు. అయితే తాజాగా పారసైట్  అనే మూవీ గురించి రాజమౌళి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తనకు అంత సీరియస్గా కనిపించలేదని... ఆ సినిమా చూస్తున్నంత సేపు నిద్ర వచ్చిందని ఆ తర్వాత తన భార్య లేపిన కూడా సినిమా చూడలేకపోయాను అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దిల్ పై సోషల్ మీడియాలో కూడా పలు విమర్శలు ఎదుర్కొన్నారు రాజమౌళి.

 


 ఇదిలా ఉంటే తాజాగా మిఠాయి అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలకు సంబంధించిన వ్యతిరేకిస్తూ ఓ పెద్ద లేఖ రాశారు. మిఠాయి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పెద్ద లేఖ రాశాడు ప్రశాంత్ కిషోర్. అయితే దీనిపై సినీ విశ్లేషకులు మాత్రం మండిపడుతున్నారు. రాజమౌళి లాంటి వాళ్ళను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడితే కాసింత పాపులారిటీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే సదరు దర్శకుడు ఇలా చేస్తున్నాడు అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: