తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ముందు నిర్మల్ జిల్లాలో భైంసా లో రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకోవటం తెలంగాణ రాజకీయాలను ఆ గొడవ కుదిపే యడం అందరికీ తెలిసినదే. ఆ తర్వాత గొడవ సద్దుమణిగేలా ప్రభుత్వం రంగంలోకి దిగడంతో పరిస్థితి అంతా సద్దుమణిగింది. అయితే ఇటీవల అక్కడ జరుగుతున్న కొన్ని అంశాలని రిపోర్ట్ చేయాల్సిన మీడియా సరిగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు బలంగా వినబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఘటన లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బాధితులను పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అదిలాబాదు కి చేరుకుని  జూమ్ యాప్ ద్వారా మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసిన బాధితుడి తో మీడియా సమావేశం పెట్టి సంచలన విషయాలు ప్రస్తావించారు.

 

ఆ బాధితుడు మాట్లాడుతూ భైంసాలో ఏం జరిగిందో అన్ని విషయాలు బయట పెట్టాడు. హిందువులు ముస్లింల మధ్య గొడవ సృష్టించే విధంగా కొంతమంది దుండగులు వ్యవహరించిన వాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నాడట. అయితే హిందువుల పండుగలు అయినా ఉగాది మరియు హనుమాన్ జయంతి, శ్రీ రామ నవమి పండుగలు ఇంటిలోనే జరుపుకోవాలని లాక్ డౌన్ టైములో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

 

కానీ ఇదే సమయంలో భైంసాలో మాత్రం రంజాన్ మాసం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒక మసీదులో నిబంధనలకు విరుద్ధంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారని, ఈ సందర్భంగా కరోనా వైరస్ ఈ విధంగా వ్యాప్తి చెందుతుంది అన్నగారికి పై దాడికి పాల్పడ్డారని, ఈ విషయంలో ఒక వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని..కాని హిందువుల పై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని అతడు పేర్కొన్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ గొడవలు సంబంధం లేని వ్యక్తులను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి పోలీసులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారని అలా చేస్తే ఊరుకునేది లేదన్నారు. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హైకోర్టును ఆశ్రయిస్తామని పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: