కోర్టుల తీర్పులు కొన్ని సందర్భాల్లో ప్రజలకు వింతగా అనిపిస్తాయి. పలు సందర్భాల్లో కోర్టులు కూడా ఎవరూ ఊహించని తీర్పులు ఇస్తుంటాయి. ఆ తీర్పులు ప్రజలను, లాయర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఒక్కో దేశంలో న్యాయవ్యవస్థ నిబంధనలు ఒక్కో విధంగా ఉంటాయి. న్యాయమూర్తులకు అవినీతిని ఆపాదించకూడదు కానీ తీర్పులకు సంబంధించి చర్చించే అవకాశాన్ని మాత్రం రాజ్యాంగం కల్పించింది. 
 
తాజాగా ఇండోనేషియా కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చింది. కోర్టు ఒక కేసులో ఇండోనేషియా అధ్యక్షుడు ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తీర్పు చెప్పింది. ఇండోనేషియాలోని పసవ్ రీజియన్ లో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. మొదట జావా ద్వీపంలోని సురభయా ప్రాంతంలో ఉన్న విద్యార్థులపై కొందరు జాత్యాహంకార దూషణలు చేశారు. 
 
దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఈ దూషణలకు, అల్లర్లకు వ్యతిరేకంగా ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలలో గత సంవత్సరం నిరసనలు జరిగాయి. మొదట చిన్నచిన్న ప్రాంతాలలో మొదలైన నిరసన జ్వాలలు అనంతరం పట్టణాలకు వ్యాపించాయి. ఈ నిరసనల వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అశాంతి వాతావరణం నెలకొంది. వదంతులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. 
 
దీంతో కొన్ని మీడియా సంస్థలు ఇండోనేషియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జకార్తా కోర్టును ఆశ్రయించాయి. అధ్యక్షుడి నిర్ణయం వల్ల మీడియా స్వేచ్ఛకు భంగం కలగడంతో పాటు మానవ హక్కులకు కూడా భంగం కలిగిందని అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని... ఆంక్షలు తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు విని షాక్ అవడం ప్రజల వంతయింది. అధ్యక్షుడు క్షమాపణ చెప్పడం వల్ల ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ ఆంక్షలు తొలగించిన తరువాత అల్లర్లు చెలరేగితే కోర్టు బాధ్యత వహిస్తుందా...? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వదంతులు వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించటాన్ని కోర్టు తప్పుబట్టడంపై కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: