ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత్ కు సంబంధించిన భూభాగంలోకి చైనా సైన్యం వచ్చి ఏకంగా గుడారాలను ఏర్పరచుకోవడం.. వెంటనే గుడారాలను తీసి వేయాలంటూ భారత సైన్యం చైనా సైనికులకు వార్నింగ్ ఇవ్వడం చైనా భారత్ సరిహద్దు లో జరిగిన విషయం. ఇక ఆ తర్వాత గుడారాలను తీసేసినట్టు నాటకమాడిన చైనా సైనికులు కొంత  దూరం వెళ్లి మళ్లీ గుడారాలను వేసుకోవడం ప్రశ్నించడానికి వెళ్ళినా కొంత మంది భారత సైనికులతో మూకుమ్మడిగా వందల మంది సైనికులు దాడి చేయడం జరిగింది, 

 

 దీంతో  కొంతమంది భారత సైనికులు అమరులవ్వగా ఎంతోమంది చైనా సైనికులు కూడా మృత్యువాత పడ్డారు. అయితే చైనా భారత్ మధ్య ఘర్షణ తలెత్తడానికి కారణం.. చైనా వేసుకున్న గుడారాలను భారత్ కాల్చివేయడం ఇచ్చిన ప్రస్తుతం ఆరోపిస్తోంది. అయితే భారత మాజీ సైనికాధికారి ప్రస్తుత కేంద్రమంత్రి అయిన వికె సింగ్... ఒక కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. చైనా గుడారాల్లో ఉన్నట్టుండి మంటలు వచ్చాయని... రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాల సైనిక ఉండకూడదని సైన్యాధికారులు నిర్ణయించి.. పరిస్తతి ఎలా ఉందని భారత సైనికులు వెళ్లినటువంటి సందర్భంలో ఈ మంటలు వచ్చాయని.. దీంతో ఆ గుడారాలను మనమే తగలబెట్టాము  అని చైనా సైనికులు ఫీలవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు వీకే సింగ్. 

 


 అదే సమయంలో భారత సైనికులు మాత్రం తాము చైనా సైనికుల గుడారాల మీదకు వెళ్లలేదని.. తగలబెట్ట లేదని చైనా సైనికుల తగలబెట్టుకుని కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గుడారాలు ఒక్కసారిగా తగలబడి పోవడం తో భారత సైనికులు తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా సైనికులు ఒక్కసారిగా మూకుమ్మడిగా భారత సైనికుల పై దాడికి దిగారని.. దీంతో అక్కడికక్కడే ముగ్గురు సైనికులు చనిపోగా...  మరో 17 మందికి గాయాలయ్యాయి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘాతుక్ టీమ్ చైనా సైనికుల పై దాడి చేయడంతో చైనా సైనికులు చనిపోయారు వందల మందికి గాయాలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: