కరోనా కోరలు చాస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీస్తోంది.. కరోనా కష్ట సమయంలో లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే కొద్దిపాటి సడలింపులతో తిరిగి ప్రారంభమైనా ముందున్న వైభవాన్ని తెచ్చుకోలేక వెలవెలబోతున్నాయి. ప్రజలు కరోనా భయంతో పెద్దగా బయటకు రావడం లేదు, అత్య అవసరమైతే కానీ ఏ వస్తువు కొనడం లేదు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. కొనుగోలు భారీగా తగ్గడంతో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించేసాయి, తద్వారా మ్యాన్  పవర్ కు ఆదరణ తగ్గి లక్షల మంది నిరుద్యోగులయ్యారు. ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డు పై పడ్డారు. ప్రజల జీవన శైలిని చిన్నాభిన్నం చేసింది ఈ కరోనా.

ఇటువంటి విపత్కర సమయంలో దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం....




రానున్న రోజుల్లో కేంద్ర పరిధిలో జరిగే అన్ని ఉద్యోగాలు నియామకానికి ఒకే పరీక్ష నిర్వహించి, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ఇప్పటికే జాతీయ నియామక సంస్థ (ఎన్ ఆర్ ఏ) ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగ నియామకం, ఎంపిక ప్రక్రియ తక్కువ వ్యవధిలోనే మరింత సులభతరం కానుందని వ్యాఖ్యానించారు మంత్రి ప్రకాష్ జవదేకర్. తద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ  నియామకాలకు 20 సంస్థలు పనిచేస్తుండగా అందులో మూడు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఈ కొత్త నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష గా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సి ఈ టి) ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ఉత్తీర్ణత సాధించిన వారికి మూడేళ్లలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రకటించారు.సి ఈ టి  ని ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. కాబట్టి డిగ్రీ, ఇంటర్ మరియు టెన్త్ లో ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా పరీక్ష రాయవచ్చని తెలిపారు...




 దేశవ్యాప్తంగా 117 జిల్లాలలో పరీక్షా విధానానికి ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది... ప్రస్తుత విధానాల ప్రకారమే రిజర్వేషన్లు అమలు అవుతాయని తెలిపారు మంత్రి. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కూడా దీనికి జతకట్టనుందని ఇప్పటికే పీపీపీ కింద గౌహతి, జైపూర్ తిరువనంతపురం విమానాశ్రయాలను లీజుకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 1070 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని వివరించారు జవదేకర్. ఏదేమైనా ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగ నియామకాల్లో పూర్తి పారదర్శకత చూపనున్నట్లు తెలిపింది కేంద్ర కేబినెట్. ఇంకేముంది మన దేశ యువత ఉత్సాహానికి అంతే లేదు.కేంద్ర ప్రభుత్వం నూతన విధానం: ఉద్యోగం రావడం మరింత సులభం, తెలిస్తే ఎగిరి గంతేస్తారు?  

మరింత సమాచారం తెలుసుకోండి: