ప్రస్తుతం టిక్ టాక్  పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. భారత రక్షణకు సంబంధించిన అంశాలకు  భంగం వాటిల్లే అవకాశముందని భావించిన భారత ప్రభుత్వం టిక్ టాక్ ను భారత్ లో  నిషేధించింది ఆ తర్వాత...  అమెరికా కూడా ఇదే తరహా ఆరోపణతో తమ దేశంలో టిక్ టాక్ బ్యాన్ చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో టిక్ టాక్  పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అమెరికా-భారత్ దేశాలలో బ్యాన్  కావడంతో ఇక దుకాణం సర్దుకోవాల్సిందే అనే పరిస్థితి వచ్చింది టిక్ టాక్ కి . ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం టిక్ టాక్  కి చివరిగా ఒక అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.



 టిక్ టాక్ అమెరికా వ్యాపార విభాగానికి సంబంధించిన యాజమాన్య హక్కులను అమెరికా సంస్థకు విక్రయించినట్లు అయితే... అమెరికాలో టిక్ టాక్ పై విధించిన నిషేధాన్ని తొలగిస్తాము అంటూ తెలిపింది. దీనిపై టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్  నిర్ణయం తీసుకోవాలి అంటూ ఒక డేట్ లైన్ కూడా విధించింది ట్రంపు సర్కార్. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వాల్ మార్ట్  కలిసి దిగ్గజ ఐటి  సంస్థ మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కానీ ఈ చర్చలు కాస్త విఫలం అయ్యాయి.



 దీంతో అమెరికాలో టిక్ టాక్ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేయడానికి ప్రస్తుతం మరో ఐటి దిగ్గజం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ జరిపిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో రంగంలోకి దిగిన.. ఐటి దిగ్గజం ఒరాకిల్ టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్  తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి అయినా బైట్ డాన్స్  టిక్ టాక్ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ట్రంప్  సర్కార్ విధించిన డెడ్ లైన్  ముగుస్తున్న నేపథ్యంలో టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: