కరోనా  వైరస్ ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్ల సర్వీసులన్ని  నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపు... అన్లాక్ లో భాగంగా.. క్రమక్రమంగా రైలు సర్వీసులను ప్రయాణికుల అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉండే ప్రాంతాలలో మరిన్ని ఎక్కువ రైలు సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి భారత రైల్వే... రైల్వే ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. త్వరలో మరిన్ని కొత్త రైలు సర్వీసులను పట్టా లెక్కించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.




 ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని అక్కడ కొత్త ట్రైన్ సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని... భారత రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే సెప్టెంబర్ 12 నుంచి కొత్తగా 80 రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు  గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా మరో 40 కొత్త ట్రైన్ లను నడుపనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 21 నుంచి ప్రభుత్వం పట్టాలెక్కించ తలపెట్టిన 40 కొత్త ట్రైన్ సర్వీస్ లు  ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇవి క్లోన్  ట్రైన్స్ అంటూ తెలిపింది.




 కేవలం రైల్వే శాఖ నిర్దేశించిన సమయంలోనే ఈ రైలు పట్టాలపై పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఒక షరతు ఏమిటి అంటే ఈ రైలులో ప్రయాణించాలంటే  ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా భారత రైల్వే శాఖ వెల్లడించింది. ఇక ఈ రైలుకు స్టాప్స్  కూడా తక్కువగానే ఉంటాయని తెలిపింది. వీటి కన్నా ముందునుంచే ప్రయాణికులు అందరికీ 230 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తీసుకురానున్న 40 కొత్త రైలు సర్వీసులు కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: