ప్రస్తుత కాలంలో భీమా అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల భీమా చేయించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆయా భీమా సంస్థలు కూడా తమ కస్టమర్లకు మేలు జరిగే విధంగా వివిధ సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రజలందరికీ ఎంతో నమ్మకమైన దేశీయ దిగ్గజ ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా... ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.



 వీటి ద్వారా కస్టమర్లకే  కాదు వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత కలిగిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పటివరకూ ఎల్ఐసి అందిస్తున్న పాలసీలలో ఎల్ఐసి జీవన్  శాంతి  పాలసీ  కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ పాలసీ తీసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇక ఈ పాలసీ ద్వారా రిటైర్మెంట్ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత సొమ్ము ప్రతినెల ఎకౌంటు దారుడు ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఈ పాలసీ లో భాగంగా ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.



 ఇక రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా సింగిల్ యాన్యుటీ ప్లాన్ పాలసీ తీసుకోవడం ద్వారా ప్రతి నెల 25 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే ఎంత మొత్తంలో పెన్షన్ పొందవచ్చు అనే విషయం కూడా ఎంత మొత్తంలో పాలసీ చేస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే పాలసీ  తీసుకునేటప్పుడు పెన్షన్ ఎలా పొందాలి అనే దానిపై 2 ఆప్షన్లను కూడా తమ కస్టమర్లకు కల్పించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అయితే పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ తీసుకోవడం ఒక ఆప్షన్ అయితే.... పాలసీ తీసుకున్న తర్వాత కొంతకాలానికి పెన్షన్ తీసుకోవడం రెండో ఆప్షన్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: