ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ వినియోగం అనివార్యంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఏ పని చేయాలన్నా ప్రస్తుతం ట్రాక్టర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా ట్రాక్టర్ ఉపయోగపడుతుంది. అయితే ఇలా రైతులు వ్యాపారులు ఎంతోమంది ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనపడినప్పటికీ  చివరికి... ఇటీవలే ఉద్గార ప్రమాణాల విషయంలో అందరూ అయోమయంలో పడ్డారు.. అయితే ఇలా ట్రాక్టర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి తీపి కబురు  చెప్పింది కేంద్ర ప్రభుత్వం.



 ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధపడిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకొని అందరికీ శుభవార్త అందించింది. బి ఎస్ నిబంధనల అమలు గడువు నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త రూల్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ట్రాక్టర్లకు కొత్త బిఎస్  రూల్స్ వర్తించవు. ఇక కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ కి బిఎస్ రూల్స్ 2021 వరకు.. ట్రాక్టర్లకు 2021 అక్టోబర్ వరకు పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది.


 
 ఈ క్రమంలోనే ట్రాక్టర్లు ఇతర కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలకు కూడా వారికి ఊరట కలిగే అవకాశముంది. కాగా కేంద్ర ప్రభుత్వం టూవీలర్లు ఫోర్ వీలర్లకు సంబంధించిన బి  ఎస్ 6 ఉత్తర ప్రమాణాలు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకు రావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న నూతన టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు అన్నీ బిఎస్ 6 ఇంజిన్  తోనే మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక మార్కెట్లో చూసుకుంటే బి ఎస్ 4 వాహనాలతో పోలిస్తే బి ఎస్ 6 వాహనాల ధర ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. కాగా  కేంద్ర ఇచ్చిన అనుమతితో పాత ఉద్గారా  ప్రమాణాలు కలిగి ఉన్న ట్రాక్టర్లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: