2019 ఎన్నికల వరకు టీడీపీ ఏం చెప్తే అది రాష్ట్రంలో ఫాలో అవుతుంది అనుకున్నారు టీడీపీ నేతలు.. ప్రభుత్వం తమదే అని ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడ్డారు.. చంద్రబాబు కొంత హెచ్చరిస్తున్నా కూడా ముసలోడే కదా అని లైట్ తీసుకున్నారు. ఎన్నికలు అయ్యాక కానీ తెలీలేదు తాము ఏం కోల్పోయామో. చంద్రబాబు వయసుకు గౌరవమిచ్చి అయన అయన మాట వింటే ప్రజల్లో తమ పార్టీ నమ్మకం పోకుండా ఉండేదని భావిస్తున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్లు ఇప్పుడు టీడీపీ నేతలు బాధపడ్డ వేస్టు..అయితే వారంతా ఓడిపోయి అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే వారి నేరాల, అవినీతి చరిత్ర ను బయటకి తీస్తూ జగన్ చేస్తున్న అవినీతి పోరాటం చూస్తే వారికి భయమేయడం ఒక ఎత్తు అయిందట..

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు పలు అవినీతి కేసుల్లో జైలు కూడు తింటున్నారు.. అచ్చెన్నా, జేసి ప్రభాకర్, కోల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు వంటి టీడీపీ ముఖ్య నేతలు అందరు జైలు ని పలకరించిన వాళ్ళే.. అయితే ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని  మిగతా వారు నోరు మెదపకుండా ఉంటున్నారట. ఇక ఇటీవలే సుప్రిం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అమరావతిలో చేసిన భూ దందా, ఇతర అక్రమాలపై సుప్రిం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పై టీడీపీ బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంది.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన లేఖలో ఎన్‌వీ రమణపై పేర్కొన్న అంశాలను పక్కదారి పట్టించేలా.. ఒక వ్యక్తిపై చేసిన అభియోగాలను మొత్తం వ్యవస్థకు ఆపాదించేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇటీవలే యనమల రామకృష్ణుడు మీడియా ముందుకు వచ్చారు. సీఎం జగన్‌ రాసిన లేఖపై విమర్శలు, విసుర్లు విసిరారు. న్యాయవ్యవస్థపై పగపట్టిన పాలకుడిని ఇప్పుడే చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్న వారు పరిపాలనకు తగరని సెలవిచ్చారు. జగన్‌రెడ్డి బెదిరింపులు తారా స్థాయికి చేరాయని మండిపడ్డారు. న్యాయవ్యవస్థను బెదిరించే స్థాయికి జగన్‌ చేరడం.. బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఈ పెడధోరణలను ఇలాగే వదిలేస్తే రేపు ఎంతకైనా తెగిస్తారంటూ భవిష్యవాణి వినిపించే ప్రయత్నం చేశారు. యనమల చేసిన వ్యాఖ్యలతోనే టీడీపీ నేతల లక్ష్యం ఏమిటో అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: