దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎంతో  మంది పై పంజా విసురుతూ ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ప్రాణాలను బలి తీసుకుంటే మరి కొంత మందికి తీవ్ర స్థాయిలో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది ఈ మహమ్మారి వైరస్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజలు అందరు భయాందోళనలో మునిగిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు రోజు రోజుకు కొత్త సమస్యలు సృష్టిస్తోంది ప్రాణాంతకమైన కరోనా  వైరస్. వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలు గుండె పనితీరులో మార్పు మెదడుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించి అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు కరోనా  వైరస్ రోగిలో సరికొత్త సమస్య వెలుగులోకి వచ్చి అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి . కరోనా  వైరస్ బారిన పడిన బాధితురాలు కంటి చూపు కోల్పోయిన మొట్టమొదటి కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదయింది. అయితే కరోనా  వైరస్ మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపడం వల్ల అదనపు సమస్యలు కూడా తలెత్తుతాయి ఇటీవల ఎయిడ్స్ వైద్యులు తెలిపారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన 11 ఏళ్ల బాలిక పాక్షికంగా కంటి చూపు కోల్పోయినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ మెదడుపై ఎక్కువగా దాడి చేయడం వల్లే ఇలా జరిగిందని ఎయిమ్స్  వైద్యుల వివరణ ఇచ్చారు.



 అయితే ఇలా కరోనా వైరస్ బారిన పడిన బాధితురాలు కంటి చూపు కోల్పోవడం దేశంలోనే ఇది తొలి అని ఏయిమ్స్ వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి గల కారణాలపై మరింత లోతుగా అధ్యయనం కొనసాగిస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా వైరస్ కు ముందు వరకు తమ బిడ్డకు ఎలాంటి సమస్యలు లేవని... కానీ ప్రస్తుతం కరోనా వ్యాధి బారిన పడిన తర్వాత తన కుమార్తెకు కళ్ళు  సరిగా కనిపించడం లేదు అంటూ తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. దీంతో ప్రత్యేక అధ్యయనం ప్రకారం బాలికకు చికిత్స అందిస్తున్నారు ఎయిమ్స్ వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: