దసరా పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతుంటాయి.  అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా... దసరా పండుగ వస్తే చాలు ఉపాధి వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సొంతూళ్లకు చేరుకొని ప్రజలతో పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు.



 ముఖ్యంగా దసరా పండుగ వచ్చినప్పుడు దసరా రోజు పండుగ ఎంత బాగా  సెలబ్రేట్ చేసుకుంటారో  తర్వాత రోజు కుటుంబంతో కలిసి సినిమా థియేటర్కు వెళ్లి ఆ సమయంలో  థియేటర్లో ఆడుతున్న కొత్త సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. ఇది సాధారణంగానే ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ సారి మాత్రం దసరా పండక్కి ప్రజల కోరిక తీర లేదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా థియేటర్ లు  తెచ్చుకున్నప్పటికీ ఎలాంటి కొత్త సినిమాలు ఆడక పోతుండడం.. అంతేకాకుండా కరోనా  వైరస్ ప్రజలు ఎంతోమంది థియేటర్లకు వెళ్లడానికి వెనకడుగు వేయడంతో ఈ దసరాకి ఎంతో మంది ప్రజల కోరిక తీరలేదు.




 సాధారణంగా అయితే దసరా పండుగ నేపథ్యంలో థియేటర్కు వెళ్లి సినిమా చూస్తేనే కానీ తెలుగు ప్రజలందరికీ పండుగ పూర్తయినట్లు గా ఉండేది కాదు. కానీ కరోనా  వైరస్ ప్రభావం కారణంగా ఆ అనుభూతి పొందలేకపోతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ క్రమంలోనే ఇటీవల దసరా సందర్భంగా విశాఖ వాసులు అందరూ జగదాంబ థియేటర్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1970లో ప్రారంభమైన జగదాంబ థియేటర్ ఎంతోమంది ప్రేక్షకులందరికీ ఎన్నో తీపి జ్ఞాపకాలను పంచుతుంది అంటూ  కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: