ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా ఉన్న విజయశాంతి దారి ఎటు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నది కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ గా  బాధ్యతలు అప్పగించినప్పటికీ గత కొంతకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు విజయశాంతి. అయితే పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు అన్న కారణంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.



 సాధారణంగా అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నో సభల్లో పాల్గొని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ తనదైన వాక్చాతుర్యంతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించినప్పటికీ.. రాష్ట్ర నాయకత్వం విజయశాంతి సహకరించలేదు అన్న సంతృప్తి విజయశాంతి లో పెరిగి పోయినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోంది విజయశాంతి. కొన్ని కొన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందినప్పటికి కూడా విజయశాంతి వెళ్లకపోవడం కొత్త చర్చకు దారితీసింది



ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో కూడా విజయశాంతి పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో సమావేశం కావడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల దాదాపు గంట పాటు ఇరువురు చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ లో సరైన ప్రాధాన్యం లభించపోవటం  నేపథ్యంలో బీజేపీ లో చేరితే మళ్ళీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని విజయశాంతిని కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు గా ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో విజయశాంతి బిజెపి పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: