క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది  తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాపారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డ్ వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయా బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు మెరుగైన క్రెడిట్ కార్డు సర్వీసులను అందించేందుకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచుతున్న  తరుణంలో రోజురోజుకు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు వల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కలగడమే క్రెడిట్ వినియోగదారులు బాగా పెరిగిపోవడానికి కారణం అన్న విషయం తెలిసిందే.



 క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు,  డిస్కౌంట్, నో కాస్ట్ ఇఎంఐ, ఇన్స్టెంట్ క్యాష్ ఇలా క్రెడిట్ కార్డు వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డును వినియోగించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది ఏ క్రెడిట్ కార్డు తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉంటారు. అయితే మీ అవసరం ప్రాతిపదికన క్రెడిట్ కార్డు పెంచుకోవడం ఎంతో ఉత్తమం అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.


 ప్రస్తుతం అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ వుంది. దేశంలో వేగంగా పది లక్షల మంది వినియోగదారులు మార్క్  దాటేసిన క్రెడిట్ గా  ఇది రికార్డు సృష్టించింది. అయితే ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చిన 20 నెలల లోపే క్రెడిట్ కార్డు ఈ ఘనత సాధించడం గమనార్హం. అమెజాన్ ఇండియా లేదా వెబ్ సైట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డు కు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్లోనే క్రెడిట్ కార్డు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల్లోనే బ్యాంకు నుంచి ఈ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది. కార్డు  పై మూడు నుంచి ఐదు శాతం రివార్డు పాయింట్లూ  కూడా లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఒక్కో రివార్డ్ పాయింట్ ఒక రూపాయి తో సమానం... వచ్చిన రివార్డు పాయింట్లు ఎప్పటికీ కూడా ఎక్స్పైర్ అవ్వవు. వీటి ద్వారా అమెజాన్ లో షాపింగ్  చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి నెల  షాపింగ్ కి గాను రివార్డు పాయింట్లు మీ ఖాతాలో యాడ్ అవుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: