ఆకాశంలో అద్భుతాలకు కొదువే లేదు. అందునా నిండు చంద్రుడు సప్తవర్ణాల్లో కాంతులీనుతుంటే ఇక  చూసి  ఆహా అనడం మనవంతే అవుతుంది. ఈ రోజు రాత్రి పూర్ణ చంద్రుడు బ్లూ మూన్‌గా కనువిందు చేస్తున్నాడు. అంటే చందమామ మొత్తం నీలంరంగులో కనిపిస్తాడని కాదు.  రోజూ మనం చూసే  వర్ణంలోనే ఉంటాడు. కానీ ఈ రోజు కాస్త పెద్దగా ఎక్కువ ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. ఇలా భారీ సైజులో ఏడాదికి 12 సార్లు కనిపిస్తాడు చంద్రుడు. ఈ రోజు  రాత్రి ఎనిమిది గంటలా 15 నిమిషాలకు బ్లూ మూన్‌ పూర్తి ప్రకాశవంతంగా కనిపించింది. అలానే చంద్రుడి పక్కన ప్రకాశవంతమైన మార్స్‌ను కూడా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పడంతో ఆ పనిలోనే నిమగ్నమయ్యారు.  

ఏడాదికి 12సార్లు కనిపించే పూర్ణ చంద్రుడికి ఒక్కో పేరు పెట్టారు. నెలలో వచ్చే రెండో పౌర్ణమికి ఇలా ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. ఈ సీజన్‌లో మూడో పౌర్ణమికి బ్లూ మూన్‌ అని పేరు పెట్టారు. బ్లూ మూన్ పేరు వెనుక నాసా చెబుతున్న కథ కూడా ఉంది. 1883లో ఇండోనేషియాలోని క్రాకాటోవా అనే అగ్ని పర్వతం పేలి భారీ ఎత్తున వెలువడిన బూడిద ఆకాశంలోకి చేరింది. ఈ బూడిద మేఘాలలోని కణాలు చంద్రునిలోని ఎరుపు రంగును చెదరగొట్టాయి. దీంతో చందమామ నీలం రంగులో దర్శనమిచ్చింది. దీన్ని నాసా అరుదైన ఘటనగా పేర్కొంది. అప్పటి నుంచి బ్లూ మూన్‌ పదం‌ వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

బ్లూ మూన్‌ వెనుక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. సాధారణంగా సంవత్సరంలో 12 సార్లు పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. చంద్రుడు 12 పౌర్ణమిలను పూర్తి చేయడానికి 354 రోజులు పడుతుంది. సంవత్సరంలో మిగిలిపోయిన రోజులన్నింటినీ ప్రీ రెండున్నర సంవత్సరాలకు ఒకేసారి కలుపుతారు. ఫలితంగా ఒక ఏడాదిలో 13 పూర్ణ చంద్రులు కనిపిస్తారు. అదనపు పౌర్ణమి అరుదైన సంఘటన కాబట్టి బ్లూ మూన్‌గా నామకరణం చేశారని  చెబుతుంటారు. బ్లూ మూన్‌ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలం మొదలు అవ్వడానికి ముందే నిశాచర జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అని కూడా పిలుస్తుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: