ప్రస్తుతం ఫ్రాన్స్ లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మత రాజ్య స్థాపన లక్ష్యంగా ఉన్న కొన్ని దేశాల నుంచి కొంతమంది పౌరులు  ఫ్రాన్స్ లోకి వచ్చి... అక్కడ తమ మతమే గొప్పది అని ప్రచారం చేసుకుంటూ ఇతర మతస్థులకు ప్రాణాలు కూడా తీస్తున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువైన తరుణంలో.. ఇలాంటి ఘటనపై ఫ్రాన్స్ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.  దీనిపై స్పందించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రాన్స్ లో ఎలాంటి రాడికల్  ఇస్లామిక్ టెర్రరిజాన్ని సహించేది లేదు అంటూ స్పష్టం చేసింది. ఒక ఫ్రాన్స్ లో రాడికల్ ఇస్లామిక్  టెర్రరిజాన్ని సహించేది లేదు అంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.




 అంతేకాదు ఫ్రాన్స్ లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్రాన్స్ లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడ వరకు దారితీస్తాయి అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం దాడులకు మాత్రమే పాల్పడిన కొంతమంది మతోన్మాదులు ఇక ఇప్పుడు ఏకంగా ఫ్రాన్స్ లో  మత  యుద్ధం సృష్టించేందుకు ఏకంగా ఎంతో మంది ప్రాణాలు కూడా తీస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు  ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది




 ఇక ఇటీవలే ఫ్రాన్స్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారిపోయింది. ఫ్రాన్స్ ఆంతరంగిక రక్షణమంత్రి ఇటీవలే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఫ్రాన్స్ ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉంది... దేశం లోపల.. బయట ఉన్న మతోన్మాదుల తో ఫ్రాన్స్ యుద్ధం చేస్తోంది అంటూ మంత్రి ప్రకటన చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో ప్రపంచానికి మొత్తం ప్రస్తుతం ఫ్రాన్సు ఉద్దేశ్యం అర్థమైంది అని విశ్లేషకులు అంటున్నారు. అయితే కేవలం ఫ్రాన్స్ లోనే  కాకుండా ఇప్పటికే అమెరికా, భారత్ లాంటి దేశాల్లో కూడా ఇలా రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాలు ఒక్కటయ్యే  అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: