వర్షాలు తగ్గు ముఖం పట్టడం తో ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయం లో శీతాకాలం మొదలై చలి తీవ్రత రోజు రోజుకు పెరిగి పోతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు చలి తీవ్రత పెరిగిపోతున్న తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అని అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్న విషయం తెలిసిందే.
దాదాపు ఉదయం 9, 10 గంటలు అయ్యేంత వరకు కూడా బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. చలి అందరిని వణికిస్తోంది. అయితే చలి తీవ్రత కారణంగా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నాం... ప్రాణాల మీదికి వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతుండగా ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రజలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి