భారత్‌ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడి మూలాలు తమ దేశంలోనే ఉన్నాయని పాకిస్థాన్‌  అంగీకరించింది. 2008లో జరిగిన దాడిలో పాల్గొన్న 11 మంది ఉగ్రవాదులు తమ గడ్డకు చెందిన వారే అని పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ తెలిపింది. ఈ మేరకు 880 పేజీలకు పైగా సుదీర్ఘ నివేదిక  తయారు చేసింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు చేరుకోడానికి ఉపయోగించిన అల్‌ ఫౌజ్‌ అనే బోటును పాకిస్థాన్‌లో ముల్తాన్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అంజద్‌ ఖాన్‌ కొనుగోలు చేసినట్టు ఎఫ్ఐఏ నివేదికలో స్పష్టం చేసింది.

ఉగ్రవాదులు భారత్‌ చేరుకోడానికి ఉపయోగించి అల్‌ ఫౌజ్‌, అల్‌ హుసేన్‌ బోట్లకు పాకిస్థాన్‌లోని  బహ్వాల్‌పూర్‌కు చెందిన షాహిద్‌ గఫూర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడని తెలిపింది. అలాగే బోటులో పని  చేసిన తొమ్మిది సిబ్బంది గురించి కూడా నివేదికలో ప్రస్తావించింది. వాళ్లంతా పాకిస్థాన్‌లోని ఏయే  ప్రాంతాలకు చెందిన వారనే విషయాలను స్పష్టంగా తెలిపింది. వీరంతా ఉగ్రవాద సంస్థగా ఐక్య  రాజ్యసమితి ముద్ర వేసిన లష్కర్‌ ఏ తోయబాకు చెందిన వాళ్లే.

పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ తయారు చేసిన నివేదికలో తమ దేశానికి చెందిన 12 వందల 10 మంది మోస్ట్‌ వాంటెడ్‌ హైప్రొఫైల్‌ ఉగ్రవాదులున్నారు. తమ దేశానికి చెందిన 12 వందల 10 మంది మోస్ట్‌ వాంటెడ్‌ హైప్రొఫైల్‌ ఉగ్రవాదులున్నారు. అయితే ఇందులో కరుడుగట్టిన ఉగ్రవాదులైన జైష్‌ ఏ మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌, హఫీజ్‌ సయీద్‌, దావూద్‌ ఇబ్రహీంల పేర్లు లేవు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ  ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నవంబర్‌ 26 దాడులకు సూత్రధారి కూడా మసూద్‌  అజారే. కానీ అతని పేరు ఎఫ్ఐఏ నివేదికలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే విధంగా  ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలో ఈ ఏడాది ఆరంభంలో హపీజ్‌ సయీద్‌కు  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది ఓ పాకిస్థాన్‌ కోర్టు. కానీ... అతని పేరు కూడా చిట్టాలో లేదు. ఇక సమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న దావూద్‌ ఇబ్రహీం గురించి కూడా ఎఫ్ఐఏ ప్రస్తావించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: