కరోనా  వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎక్కువగా పడింది అన్న విషయం తెలిసిందే. కాగా  కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాడు మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ పలు రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ విద్యాసంస్థలను ప్రారంభించేందుకు నిర్ణయించాయి అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ చిన్న చిన్న లోపాలను అధిగమిస్తూ ఎంతో ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నాయి.


 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మరోసారి కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆలోచనలో పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలను ఇప్పట్లో తెరిచే  అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పింది ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేంతవరకు పాఠశాలలు పునః ప్రారంభం ఉండదు అంటూ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలకు తమ పిల్లలను పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం సుముఖత చూపడం లేదు అంటూ తెలిపిన ఆయన.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం ఏమాత్రం క్షేమం కాదు అంటూ చెప్పుకొచ్చారు.



 ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఢిల్లీలోని ఏ పాఠశాల కూడా తెరుచుకునేందుకు వీలు లేదు అంటూ స్పష్టం చేశారు ఆయన. లాక్ డౌన్ విధించిన కారణంగా మార్చి చివరి వారం నుంచి పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఢిల్లీలో స్కూల్స్ తెరుస్తారని భావించినప్పటికీ ఇటీవల మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో గతంలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో మళ్లీ కఠిన ఆంక్షల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: