గ్రేటర్ పరిధి లో జిహెచ్ఎంసి ఎన్నికల హడావిడి మొదలైంది ఇప్పటికే జి హెచ్ ఎం సి ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తూ ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించడం తో అభ్యర్థులంద రూ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వ హిస్తున్నారు సాధారణం గా అయితే ఎంతో మంది అభ్యర్థులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వారు.. జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుంచే ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటూన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక  ఇప్పుడూ జీ హెచ్ ఎం సీ ఎన్నిక లో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో వ్యూహాత్మకం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నే ఎంతో మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తు లా కృషి చేస్తామంటూ ప్రస్తుతం ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమ  ప్రసంగాల తో ఆకట్టు కుంటున్నారు ఎంతో మంది అభ్యర్థులు. ఇక ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు ఇండిపెండెంట్ అభ్యర్థి.




 స్వతంత్ర అభ్యర్థి పండుగల మాధవి ఇంటింటికి తిరుగుతూ ముమ్మర ప్రచారం చేపట్టారు. తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ లోని అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు కల్పించేందుకు శాయశక్తు లా కృషి చేస్తూ అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడ తాను  అని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటింటికి తిరుగుతూ తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని... ఇచ్చిన మాట నిలబెట్టుకునే అభివృద్ధి చేసి చూపిస్తాను అంటూ స్వతంత్ర అభ్యర్థి పండుగల మాధవి మచ్చ బొల్లారం 133 వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: