హైదరాబాద్ నగరం ఇప్పుడు కాస్త శాంతించింది.. మొన్నటి దాకా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన నగరం ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో సంబరాల హేలిగా మారిపోయింది. గులాబి జెండాలు , కాషాయం జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ఎన్నికల్లో ముందంజలో టీఆర్ఎస్ పార్టీ ఉండగా, రెండో స్థానంలో కమలం ఉంది.అధికార పార్టీ కారు జోరుకు కమల నేతలు బ్రేకులు వేశారు.. మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపి ఈ ఎన్నికల్లో కూడా తెరాస పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది.



తెరాస అంత లేకున్నా కూడా చివరి వరకు గట్టి పోటీని బీజేపి ఇచ్చింది. ఈ విజయంతో తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ గెలుపు బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్‌ను నింపింది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఎన్నికల కమిషనర్‌, డీజీపీలకు అంకితం ఇస్తున్నానని ఆయన అనడం ఆలోచనలో పడేసింది.. 


నగరంలోని పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీకి సపోర్ట్ గా నిలిచి అభ్యర్థులను గెలిపించారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీ పై నమ్మకం తగ్గడం వల్లే బీజేపి కి మద్దతు తెలిపారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటానని ఈ సందర్బంగా తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానని పేర్కొన్నారు.సర్జికల్ స్ట్రైక్‌ ప్లేస్‌లో సాఫ్రాన్‌ స్ట్రైక్‌ చేశామని తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజల సహకారం ఉంటే పార్టీ అధికారాన్ని చేపడుతుందని ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: