ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్  ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు తగ్గిందనే చెప్పాలి. వారి  జోరుకు హైదరాబాదీ ఓటరు గట్టి షాకే ఇచ్చాడు. ఏకైక పెద్ద  పార్టీగా అవతరించినప్పటికీ... 2016 ఎన్నికల్లో సాధించిన 99 సీట్లకు చాలా దూరంలో కేసీఆర్ దళం  ఆగిపోయిందనే చెప్పాలి.మరోవైపు భారతీయ జనతా పార్టీ  ఊహించని రీతిలో తన బలాన్ని 4 నుంచి 48కిపైగా స్థానాలకు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గట్టి దెబ్బకొట్టిన కమలం పార్టీ.. పాత బస్తీలో కొన్ని చోట్ల గట్టి ‌ స్థానాలను సైతం సాధించడం జరిగింది.

ఇక కాస్తో కోస్తా ఆంధ్ర ప్రజల పుణ్యం వల్ల టీఆర్ఎస్ పరువు నిలబెట్టుకుంది.ఇక బీజేపీ కి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని ఆంధ్ర ప్రజలు టీఆరెస్ పార్టీకి గట్టిగ ఓట్లు వెయ్యడం జరిగింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్లలో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది.దీంతో కేసీఆర్ కి ఆంధ్రుల విలువ ఏంటో అర్ధమయ్యింది. ఇంకా  ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: