ఇక ఇటీవలే అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం లో రాఘవన్ పల్లి లో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా ఐదుగురు మృత్యువాత పడిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 29 ఏళ్ల రాజశేఖర్ అనే యువకుని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో స్థానికులు పాపం ఎవరో కుర్రాడు చనిపోయినట్టు ఉన్నాడు అని మృతదేహాన్ని చూసేందుకు రోడ్డుపైకి వెళ్లారు కానీ అంతలో మరో రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఎంతో వేగంగా స్థానికుల వైపు దూసుకు వస్తున్న లారీని చూసి ఎంతో మంది స్థానికులు చెల్లాచెదురుగా పారిపోయారు. కానీ నలుగురు పరిగెత్తే లోపేవారి పైకి దూసుకొచ్చింది లారీ.
ఇక ఈ రెండు ప్రమాదంలో ఏకంగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. రెండో ప్రమాదంలో బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామానికి చెందిన శివమ్మ(48), సంజీవపురానికి చెందిన వలీసాబ్(52), అదే గ్రామానికి చెందిన సూరి(32), తాడిమర్రి మండలం నార్సంపల్లికి చెందిన శ్రీనివాసులు (49) ప్రాణాలు కోల్పోయారు. అలాగే లింగారెడ్డిపల్లికి చెందిన రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. యువకుడి మరణమే విషాదం అనుకుంటే... మరో నలుగురు చనిపోవడం స్థానికుల్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి