మహిళల భద్రత కోసం ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులతో ఏర్పాటైన అత్యున్నతస్థాయి కోర్ గ్రూప్ కమిటీ శుక్రవారం స్మితా సబర్వాల్ అధ్యక్షతన భువనగిరి డాల్ఫిన్ హోటల్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తిని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదన్నారు.మహిళల భద్రతా పరమైన సమస్యలు తెలుసుకుని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లపై విస్తృత ప్రచారం చేసి వాటి పై అవగాహన కల్పిస్తామని ఆమె అన్నారు.
ఈ మేరకు డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి, ఇతర సలహాలను, సూచనలను కమిటీ సభ్యులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.మహిళలు అభివృద్ది చెందినప్పుడు దేశం కూడా బాగుంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్, హైదరాబాద్ షీ టీమ్ ఇంచార్జి అధికారి అనసూయ,ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య దేవరాజ్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా తది తరులు పాల్గొన్నారు.. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి