ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ మేలు జరిగే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంటులో ఈ వ్యవసాయ చట్టాలకు ఆమోదముద్ర వేసిన  సమయంలో ప్రతిపక్షాలు వ్యవసాయ చట్టాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికి కూడా ఎక్కడ వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో దృఢసంకల్పంతో విమర్శల  మధ్య వ్యవసాయ చట్టాలకు ఆమోదముద్ర వేయించుకుని ఆ తర్వాత వీటిని చట్టాలుగా  అమలులోకి తీసుకువచ్చింది. దళారీ  వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి.. రైతులకు సరిగా కొనుగోలుదారులతో సంబంధం ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది.


 అయితే వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిన కొత్తలో కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా భారీ ర్యాలీలు నిర్వహించి రైతులందరికీ వ్యవసాయ చట్టాల పై వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.. ఇక ఇన్ని రోజుల తర్వాత ఇటీవలే పంజాబ్ రైతు సంఘాల మొత్తం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీగా ఉద్యమ బాట పట్టారు. ఈ క్రమంలోనే పంజాబ్ రైతులందరూ కూడా ప్రస్తుతం వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడుతున్నారు. 24 గంటల పాటు ఢిల్లీ సరిహద్దు లోనే ఉంటూ నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు రైతు సంఘాలు.


 అయితే రైతు సంఘాలు చేపడుతున్న నిరసనలపై అటు బీజేపీ  నేతలు మాత్రం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రైతులందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఆమోదిస్తున్నారు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే 99.99 శాతం మంది రైతులు వ్యవసాయ చట్టాలకు అనుకూలంగానే ఉన్నారని కొంతమంది రైతులు మాత్రమే ఉద్యమం చేపడుతున్నారు అంటూ అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు ప్రతిపక్షాలు కావాలని రైతు సంఘాలను  రెచ్చగొడుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: