అయితే ఇలా మార్కెట్లోకి వస్తున్న ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ ల కారణంగా కొత్త అందం రావడం ఏమో కానీ ఉన్న అందం పోయి చివరికి అందవిహీనంగా మారుతున్న ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ఎంతో అందంగా కాంతివంతంగా మారుస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే జపాన్ లో సరికొత్తగా ఫేస్ ప్యాక్ లను తయారు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఈ సరికొత్త ఫేస్ ప్యాక్ లకు అటు డిమాండ్ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.
ఏదో సుగంధద్రవ్యాలతో ఈ ఫేస్ ప్యాక్ లు తయారు చేస్తున్నారు అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే జపాన్ లో ఫేస్ ప్యాక్ తయారు చేస్తుంది కోకిల రెట్టలతో. కోకిల రెట్టలు ఎండబెట్టిన తరువాత ఆ రెట్టలను పొడిగా చేసి బియ్యం కడిగిన నీటిలో కలిపి ముఖానికి అప్లై చేసుకుంటున్నారట. ఇక ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం ఎంతో కాంతివంతంగా మృదువుగా మారుతుందని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాకుండా నత్తల తో కూడా ఫేస్ ప్యాక్ లు వేస్తున్నారు. నత్తలు ను ముఖం మీద వదిలేస్తారు ఇక ఆ నత్తలు వదిలేసిన జిగట పదార్థం ద్వారా చర్మం మృదువుగా మారడంతోపాటు ముడతలు కూడా రాకుండా ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి