ఈ విషాదకర ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమనగల్లు లో సత్తయ్య రాధమ్మ దంపతులు ఉంటున్నారు. అయితే రాధమ్మ ఇటీవలే బట్టలు ఉతికి ఇంటి ఎదురుగా ఉన్న వైరు పై ఉతికిన బట్టలను ఆరేసెందుకు ప్రయత్నించింది. అయితే ఆ వైరు కు విద్యుత్ వైరు తగిలి ఉండడంతో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది ఇది గమనించని రాధమ్మ అలాగే బట్టలు ఆరేసింది. దీంతో ఆమెకు షాక్ కొట్టింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న భర్త సత్తయ్య ఆమెను గమనించి కాపాడేందుకు ప్రయత్నించాడు ఇక వీరిద్దరికి షాక్ కొట్టింది.
వెంటనే కరెంట్ షాక్ కొట్టి విల విల లాడి పోతున్న ఇద్దరిని గమనించిన ఎదురింట్లో ఉన్న దంపతులు లింగయ్య లచ్చమ్మ పరుగున వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే కర్రతో వారిని కాపాడటం మానేసి వారు కూడా వచ్చి ఇద్దరు దంపతులు ముట్టుకోవడంతో అందరికీ కరెంట్ షాక్ కొట్టింది. దీంతో నలుగురు కరెంట్ షాక్ తో విలవిలలాడుతూ అక్కడే ప్రాణాలు వదిలారు. అయితే ఒకే సారి కరెంట్ షాక్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఎంతో మంది బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి