అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తం కావడంతో బర్డ్ ఫ్లూ ప్రభావం అంతగా తెలుగు రాష్ట్రాలలో లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ఒక్క కేసు కూడా తెలుగు రాష్ట్రాలలో నమోదు కాలేదు. అయితే ఇటీవలే నల్గొండ జిల్లా నార్కట్ పల్లి లో కోళ్లు చనిపోవడం కలకలం రేగింది.
ఓకే పౌల్ట్రీ ఫారం లో భారీగా కోళ్లు చనిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా 6400 కోళ్లు మృత్యువాత పడ్డాయి. కంపెనీ యజమానులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న వారు పరిశీలించారు.
అయితే అక్కడ చనిపోయిన కోళ్లు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదని.. పౌల్ట్రీ ఫామ్ కు చెందిన నీళ్ల ట్యాంకులో విషపు గుళికలు కలిపిన ఆనవాళ్లు దొరికాయి అని చెప్పుకొచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న తరుణంలో ఒకేసారి అన్ని కోళ్లు చనిపోవడంతో ప్రజలలో ఎంతో ఆందోళన నెలకొంది. ఇటీవల తెలంగాణ మంత్రులు కూడా బర్డ్ ఫ్లూ పై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.. బర్డ్ ఫ్లూ పై తెలంగాణ ముందే అప్రమత్తమైంది సరిహద్దు జిల్లాల్లో యంత్రాంగాన్ని ఎప్పుడూ అప్రమత్తం చేశామని చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి