జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాని వెనుక రాజకీయ లబ్ది చాలానే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం ఉండదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ వరాలు కురుస్తున్నాయి. జగన్ సీటులో కూర్చున్న దగ్గర నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పథకాల రూపంలో ప్రజల ఖాతాలో డబ్బులు వేసేస్తున్నారు. దీంతో ప్రజలు జగన్‌కు సపోర్ట్‌గానే ఉన్నారు.

ఇక మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయినా, నిత్యావసర వస్తువుల ధరలు పేలుతున్న కూడా ప్రజలు సంక్షేమం వైపే మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది. అసలు ఏపీలో ఉన్న ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏదొక సంక్షేమ పథకం అందుతూనే ఉంది. ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీతో జగన్ మరో మెట్టు ఎక్కేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే వారికి ఇళ్ళు కట్టి ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరగబోయే పంచాయితీ  ఎన్నికల్లో అడ్వాంటేజ్ కానున్నాయి. ఈ పథకాలే వైసీపీకి ప్లస్ అవుతాయి. వీటికి తోడు జగన్ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవం అయ్యే పంచాయితీలకు నగదు పురస్కారం అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ విషయం గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే చెప్పారు.

కానీ ఈ విషయం అప్పుడు ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో అదే జీవోని ఇప్పుడు తెరపైకి తెచ్చారు. దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఏకగ్రీవం చేసుకుంటే నగదు పురస్కారాలు ఇస్తామని ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఈ నిర్ణయంతో ప్రజలు వైసీపీ వైపుకు వస్తారని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఏకగ్రీవాల కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. మొత్తానికైతే జగన్ ఒక్క నిర్ణయంతో పంచాయితీలని మడతపెట్టేశాలా ఉన్నారు. మరి ఈ విషయంలో టీడీపీ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: