ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రంగం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వేళ... ఇప్పుడు అందరి దృష్టి పంచాయతీ మొదటి దశ ఎన్నికలపై పడింది. ఆంధ్రప్రదేశ్‌ లో ఈరోజు తొలిదశ ఓటింగ్ జరగనుంది. అందుకు సంబంధించి 12 జిల్లాల్లో అధికార యంత్రాంగం ఫుల్ బిజీ గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా 3 వేల 249 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 525 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 12 జిల్లాల్లో 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు లెక్కించే కార్యక్రమం మొదలు అవుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు అధికారులు. ఈ సందర్భంలో ఏపీ రాజకీయ వాతావరణం సందడి సందడిగా మారింది.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తాజా వార్త గురించి ఓటర్లు తప్పక తెలుసుకోవాలి...మామూలుగా ఎన్నికలలో ఓటును వేయాలంటే తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. కానీ నీ దగ్గర ఇప్పుడు ఓటర్ కార్డు లేకపోయినా పర్వాలేదు.... ఈ క్రింద చెప్పబడిన ఈ పదకొండు ఐడి కార్డులలో ఏ ఒక్కటి ఉన్నా మిమ్మల్ని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం..

1.కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఐడీ కార్డు.
2.పాన్ కార్డ్.
3.పాస్ ‌పోర్ట్.
4.డ్రైవింగ్ లైసెన్స్.
5.బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన పాస్‌బుక్స్. ఫోటోతో ఉన్నవి.
6.ఆధార్ కార్డ్.
7.ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్.
8.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక ఐడీ కార్డ్.
9.కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ స్మార్ట్ కార్డ్.
10.నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్.
11.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్.

ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరేముందు.. మీ దగ్గర ఓటు కార్డు ఉందా లేదా చెక్ చేసుకుని.. ఒకవేళ లేనట్లయితే పైన చెప్పబడిన 11 ఐడీ కార్డులో ఏ ఒక్కటి మీకు సంబంధించింది ఉన్నా మీకు ఓటు వేసేందుకు అనుమతి లభించినట్లే. కాబట్టి మీరు వేసే ఈ ఓటు ఎంతో ముఖ్యమైందని గ్రహించండి. ఒకవేళ మీరు ఓటుకు గైర్హాజరు అయితే మీఒక్క ఓటు ఫలితాన్ని తారు మారు చేసే అవకాశముంది. ఓటు విలువ తెలుసుకో ..ఓటు హక్కును వినియోగించుకో...!

మరింత సమాచారం తెలుసుకోండి: