ప్రేమ పెళ్లి కోసం పెద్దలను కూడా ఒప్పించింది. ఇక పెద్దల అందరి సమక్షం లోనే పెళ్లి జరిగేందుకు అంతా సిద్ధమైంది. కానీ పెళ్లి జరిగే ఆఖరి క్షణంలో వరుడికి షాకిచ్చింది వధువు. ఏకంగా ప్రేమించిన వాడిని కాదని మరో వ్యక్తితో అక్కడి నుంచి జంప్ అయ్యింది పెళ్లికూతురు. అటు ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఈ ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. పెరంబుర్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తుంది. ఆమెకు అదే సంస్థలో పని చేస్తున్న యువకుడితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడగా పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది.
ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించి వారి ప్రేమ విషయాన్ని చెప్పి ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి అంగీకరించేలా చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఇక పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. కాగా పెళ్లి వేడుక మొదలైంది. ఇక కళ్యాణ మండపంలో వివాహం చేసే ఏర్పాట్లు ముగించారు. ఇక వివాహ వేడుకల్లో భాగంగా రాత్రి వధూవరులు రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధువులు స్నేహితులు ఆశీర్వాదం తీసుకున్నారు. కళ్యాణ మండపంలోని వేర్వేరు గదుల్లో వధూవరులు ఉన్నారు. రాత్రి రెండు గంటల సమయంలో తల్లి గదిలోకి వెళ్లి చూడగా కుమార్తె గదిలో కనిపించలేదు. దీంతో తల్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో వధువు వేరే వ్యక్తి తో వెళ్ళిపోయింది అని తెలిసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి