ఈ మధ్యకాలంలో ఇక సొంత ఊరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు అక్కడ సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అటు ఇంటి రెంట్ కూడా భారీగా పెరిగిపోవడంతో ఎంతోమంది అద్దె ఇంట్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ప్రతి చోట ప్రస్తుతం భారీగా రెంట్ వసూలు చేస్తుంటే ఇక్కడ మాత్రం అసలు ఇళ్లకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదు.  ఇంటికి అద్దె  చెల్లించకుండానే  హాయిగా ఇంట్లో బస చేయవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ అని అంటారా.. ఇది మన దేశంలో కాదులేండి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో.



 కాలిఫోర్నియాలో ఉన్న స్లాబ్ సిటీ  ఇళ్లకు అద్దె  చెల్లించాల్సిన అవసరం అస్సలు లేదు. అంతేకాదు అక్కడ చట్టాలు, నిబంధనలు లాంటివి ఏమీ ఉండవు. ఇక ఈ స్లాబ్ సిటీ మొత్తం  ఎడారిలో ఉంది. ఇక ఈ స్లాబ్ సిటీ కి వెళ్ళాలి అంటే శాన్డియాగో నుంచి ఈశాన్యంగా దాదాపు 240 కిలోమీటర్లు వెళ్లాలి. అది పేరుకి నగరంగా పిలుచుకుంటున్నప్పటికీ ఇరుకు ఇరుకు గదుల తో కాకుండా అక్కడక్కడా మాత్రమే ఇల్లు ఉంటాయి.  ఇక చుట్టూ పర్వతాలు ఎడారి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ స్లాబ్ సిటీ లో కేవలం 150 కుటుంబాలు మాత్రమే ప్రస్తుతం ఉంటున్నాయి.



 అక్కడ ఉంటున్న వారందరూ స్థానికులు కాదు ఎక్కడినుంచో వచ్చి అక్కడ ఉంటున్న వాళ్లే. అయితే ఇక ప్రభుత్వ పాలనకు ఈ నగరానికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో కనీస మౌలిక వసతులు కూడా లేవు అక్కడ. కనీసం కరెంట్ కూడా లేకపోవడంతో అయితే అక్కడ ఉంటున్న వాళ్లే వివిధ రకాల ప్రయత్నాలతో సౌకర్యాలను పొందుతున్నారు. సాధారణంగా 1930లో ఇది ఒక ఆర్మీ బేస్ క్యాంపు గా ఉండేది అని చెబుతూ ఉంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఆర్మీ బేస్ క్యాంప్ ఖాళీ అయిందని ఆ తర్వాత స్లాబ్ సిటీ గా మారింది అంటూ చెబుతూ ఉంటారు. ఎంతో మంది పర్యాటకులు సరదాగా అక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు గడుపుతూ ఉంటారు. అమెరికా లాంటి హై సెక్యూరిటీ దేశంలో ఇలాంటి నగరం ఉందంటే నమ్మశక్యం కాని విధంగానే ఉంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: