ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే అసలు మనుషుల ప్రాణాలకు ఎక్కడ విలువ లేకుండా పోతుంది అని అర్థమవుతుంది. ఎంతో విలువైన ప్రాణాలను చిన్నచిన్న కారణాలకే తీసేసుకుంటున్నారు. చిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు.  అయితే క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదం నిండి  పోతుంది అన్న విషయం తెలిసిందే. తండ్రి మందలించాడని లేదా టీచర్ తిట్టిందని స్నేహితులు మాట్లాడటం లేదని ఇలా చిన్న చిన్న కారణాల తోనే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగిస్తున్నారు ఎంతోమంది.



 ఇలా క్షణికావేశం లో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.  ప్రతి రోజు ఇంటివద్దే ఉంటూ బలాదూర్ గా  కొడుకు తిరగడంతో తట్టుకోలేక పోయాడు తండ్రి. ఏదైనా పని చేసుకొని ప్రయోజకుడుగా  మారాలి అంటూ పలు మార్లు కొడుకుకి సూచించాడు. అయినప్పటికీ కొడుకు తీరులో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమం లోనే ఇటీవలే ఓ సారి గట్టిగా మందలించాడు తండ్రి. ఏదైనా పని చూసుకోవాలి అంటూ కోపంగా చెప్పాడు.



 అయితే తండ్రి మందలించడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు కొడుకు. చివరికి క్షణికావేశం లో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మార్కుక్  మండలం వరద రాజాపూర్ లో చోటు చేసుకుంది. నర్సింలు అనే వ్యక్తిని  ఏదైనా పని చేసుకోవాలి అంటూ తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెంది పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: