ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు బయటకు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. కొంతమంది నేతలు కు సంబంధించి ఇప్పటికే అధికార వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరు పార్టీ మారుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే కీలక నేతకు సంబంధించి ప్రకటన రానుంది అని అంటున్నారు. కీలక నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేకపోయింది అనే మాట వాస్తవం.

ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన పార్టీ ప్రభావం చాలా బాగుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా సత్తా చూపలేకపోయింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గాల ఇన్చార్జిలను ఆయన మార్చే ఆలోచనలో ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటనే దానిపై స్పష్టత లేదని ఆయన ఎవరిని తప్పిస్తారు ఏంటనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు  అని అంటున్నారు. అయితే రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది మాత్రం పార్టీ మారిపోయే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆయనతో పాటుగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ పార్టీ మారడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత కూడా రానుందని సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్టీ మారిపోయే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్పష్టత కూడా ఇచ్చేశారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: