చాలామందికి పొన్నగంటి కూర గురించి తెలిసి ఉండకపోవచ్చు.కానీ ఈ పొన్నగంటి కూర తింటే కలిగే ఉపయోగాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.ఆ ఆకు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని మరి వెళ్లి కొనుకుంటారు. ఈ ఆకు యొక్క కాండం కాస్త మందంగా ఉండి శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది.దీనికి విత్తనాలు ఉండవు. కేవలం కాండం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందే మొక్క. ఇది సులభంగా అభివృద్ధి చెందే ఆకుకూర. ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ రక్తంలో చేరుకోకుండా కాపాడుతుంది. తరుచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఈ ఆకులో ఉన్న పోషకాలు అధిక రక్తపోటును దరి చేరనీయదు.



అంతేకాకుండా  గుండె సమస్యలను కూడా  అదుపులో ఉంచుతుంది. కంటి కింద నల్లని వలయాలు ఏర్పడిన వారు ఈ కూర తినడం వలన కంటి కింద నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి.ఈ ఆకు తింటే కంటి సమస్యలు ఏర్పడవు. ఆ పొన్నగంటి ఆకును పప్పు, పచ్చడి, ఇంకా వివిధ రకాల వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఈ కూరను వేపుడు కంటే ఉడికించి తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి. అంతే కాకుండా ఈ కూర తినడం వల్ల నోటి దుర్వాసన తొలగుతుంది. ఇందులో విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఈ ఆకును శుభ్రంగా కడిగి, తరిగీ కాస్త పెసరపప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి కాస్త నూనె జోడించి ఉడికించి తీసుకోవడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.



బరువు తగ్గాలి అనుకున్నవారు ఈ కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.బరువు పెరగాలి అనుకునేవారు కందిపప్పు తో ఈ ఆకును వండి, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఈ ఆకు సహజమైన చర్మ కాంతిని ఇస్తుంది.మంచి పోషకవిలువలు ఉన్న ఈ ఆకుకూర వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవడం వల్ల కంటిసమస్య నుంచి బయట పడవచ్చు. ఈ ఆకును పప్పుతో కన్నా ఉడికించి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ.ఈ కూరను పదేపదే వేడి చేసి తినడం వల్ల వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: