ఇక అంతే కాదు భారత్కు వ్యతిరేకంగా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం నేపాల్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడి నినాదాలు చేయడం సంచలనంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. ఇక నేపాల్ లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత చివరికి ఇక నేపాల్ అధ్యక్షుడిగా ఉన్న ఓలి శర్మ రాజీనామా చేయడం మరింత సంచలనం గా మారిపోయింది. ఇక ఇప్పుడు నేపాల్ ప్రజలందరి లో కూడా భారత్ పై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు చైనా ఇంకా కుట్రలు పన్నుతోంది అన్నది అర్ధమవుతుంది.
నేపాల్ లో ఒక బాంబు బ్లాస్టింగ్ జరగడం సంచలనంగా మారింది. తరాయి ముక్తి మోర్చా అనే సంస్థ నేపాల్ లో బాంబు బ్లాస్ట్ మేమే చేసాము అంటూ చెప్పుకుంటుంది. అయితే ఈ బాంబు బ్లాస్టింగ్ కారణంగా ఏకంగా ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ బాంబు బ్లాస్ట్ వెనుక పెద్ద కుట్ర అని ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ముక్తి మోర్చా లాంటి పదాలు ఎక్కువగా భారత్ లో ఉపయోగిస్తారు కాబట్టి ఒక రకంగా ఈ బాంబు పేలుడుకు కారణం భారత్ అనే విధంగా అక్కడ నేపాలి ప్రజల్లో భావన తీసుకొచ్చేందుకు చైనా ఇలాంటి కుట్ర పన్నింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి