ఈ మేరకు బీజేపి నేతలు కాస్త దూకుడుగా వెళుతున్నారు.. టిడిపిని టార్గెట్ చేసిన బీజేపి అగ్రనేత టీడీపీ అధినేత నేత చంద్రబాబు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.చంద్రబాబు హోదా కన్నా ప్యాకేజీయే ముద్దు అన్నారని ఎద్దేవా చేశారు.తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం సోమవీర్రాజు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబే దగ్గరుండి ప్యాకేజీ తీసుకున్నారని తెలిపారు. ఈరోజు అధికారం పోయాక వారి ఎంపీలు హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార పార్టీ ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు చేసి గెలుపొందింది.
తిరుపతి ఎన్నికల్లో గెలుపు కోసం రెండు లక్షల దొంగ ఓట్లను వేసేందుకు ఆధార్ కార్డులు తయారు చేసినట్టు తెలుస్తోంది.ఏపీలో ప్రజలు బీజేపీని గెలిపించకపోయినా బీజేపీ మాత్రం రాష్ట్రంపై ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. ఇప్పటికే 503 ప్రాజెక్టులను ఎంపిక చేశారని,రూ.8 లక్షల కోట్లు త్వరలోనే ఇవ్వబోతున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ను అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేయడంతో పాటుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ద్వజమెత్తారు.తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఎంతో నిధులు ఇచ్చినట్టు తెలిపారు..మరి బీజేపి అనుకున్న ఫలితాలు వస్తాయో లేదో మరి కొద్ది రోజుల్లో తేలనుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి