కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆపబోము అంటూ స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రమే కాదు అధికార పార్టీ నేతలు సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు కూడా చేశారు. అయితే రోజురోజుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న తరుణంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మరింత కీలకం గా మారిపోయాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది అనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల్లో కాదు రానున్న రోజుల్లో లాభాల్లోకి చేరబోతోంది అన్నది సంస్థ ప్రకటించడం మరింత కీలకంగా మారిపోయింది. వార్షిక బడ్జెట్ ప్రకారం త్వరలోనే విశాఖ స్టీల్ప్లాంట్ లాభాల్లో కి వెళ్లబోతుంది అన్నది ప్రకటించింది కంపెనీ . అదేసమయంలో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ స్టీల్ ప్లాంట్ మూసివేయడానికి వీలు లేదు అంటూ ప్రజావ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేయడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి