దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది.. ప్రతి ఒక్కరు కూడా ఆధునిక జీవన శైలికి అలవాటు పడిపోతున్నారు..  సాంప్రదాయాలను..  ఒకప్పటి ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి భోజనం చేయడానికి ఆసక్తి చూపే వారు కానీ నేటి రోజుల్లో ఇంటి భోజనం ఉన్నప్పటికీ కూడా హోటల్ భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మసాలాలు దట్టించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ఇష్టపడుతున్నారు. అయితే మసాలాలు దట్టించిన ఆహారం అటు టేస్ట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం పరంగా మాత్రం ఎన్నో కొత్త సమస్యలు తీసుకువచ్చి పెడుతున్నది.


 నేటి రోజుల్లో జనాలు ఎలా మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇక చివరికి పెద్దలు చెప్పిన ఆహారపు అలవాట్లే ఎంతో మంచిదని భావించి మళ్లీ ఇక ఒకప్పటి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు పెద్దలు చెప్పిన ఆహారాలే ప్రస్తుతం స్టార్ హోటల్ లో స్పెషల్ డిష్ లుగా మారిపోతున్న ఘటనలు కూడా తెర మీదికి వస్తున్నాయి. ముఖ్యంగా బియ్యం ఉడకపెట్టిన గంజి తాగడం వల్ల ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఒకప్పుడు అందరూ అదే తాగే వారు కూడా.


 అందుకే 90 ఏళ్ల వయస్సు దాటి పోయినప్పటికీ ఇప్పటికీ కూడా దృడంగా చెక్కుచెదరకుండా ఉంటారు. గంజి తాగటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అనేది మాత్రం నేటి రోజుల్లో ఎవరికీ తెలియదు. గంజి తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. వీరేచనాలు అయినవారు గంజి నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదు చర్మంపై దురద వస్తున్న సమయంలో గంజి నీటిని ఇక అక్కడ పోసి సున్నితంగా మర్దన చేయడం వల్ల దురద నుంచి బయటపడవచ్చు. గంజి నీటిలో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అందుకే గంజి నీరు తాగడం వల్ల శరీరంలో  అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: