దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది అనే భావన చాలా వరకు కూడా ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా రైతులకు అందించే కొన్ని కార్యక్రమాల విషయంలో తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయి అనే భావన కూడా ఉంది. ఇక కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులకు సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు అని కొంతమంది అంటున్నారు.

 అది అలా ఉంటే ఇప్పుడు గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం పెరిగిపోతున్నది. చాలామంది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇల్లు కట్టుకుందామని ఎదురుచూస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీని వలన మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన మొదలైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనబడడం లేదు. దీనితో మధ్యతరగతి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగిపోతుందని అంటున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంతమాత్రం కూడా మంచిది కాదు. మధ్య తరగతి ప్రజలు... ఇప్పటికే ధరల పెంపుదల పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా పెంచడం పై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

 ఇక ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే సమస్యలు ఎదురు కావచ్చు. నిర్మాణాల విషయంలో పేదల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాలు ప్రధానికి తెలియడం లేదని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: