ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజు దాదాపుగా నాలుగు లక్షల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారిపోతున్నాయి. అయితే మొదటి రకం కరోనా వైరస్ విజయవంతమైన కేంద్ర ప్రభుత్వం రెండవ దశ కరోనా నియంత్రణ విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయింది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయ్.  అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రించడంలో పూర్తిగా విఫలం అయింది అంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు అన్నీ ఏకమయ్యాయి.



 కరోనా వైరస్ కట్టడిలో మోదీ వైఫల్యాలు అంతేకాకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఒక ఘాటు లేఖ కేంద్రానికి రాసాయి విపక్ష పార్టీలు. ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహారా ఏకంగా 12 మంది విపక్ష నేతలు ఏకమై  ప్రధాని నరేంద్ర మోడీ  ఘాటు లేఖ రాయడం సంచలనంగా మారింది. కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుంటే ఈ వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా కూడా పట్టించుకోలేదని ఇక దేశంలో మరింత దారుణమైన పరిస్థితులు రాకముందే తీసుకోవాల్సిన  చర్యలపై చర్చించే ఉద్దేశంతోనే లేఖ రాసినట్లు విపక్షాలు పేర్కొన్నాయి.



 దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ విపత్కర పరిస్థితి ఏర్పడుతుంటే..ఈ సమయంలో విస్టా ప్రాజెక్ట్ నిర్మానం ఏంటి అంటూ విపక్షాలు లేఖలో ప్రశ్నించాయి. వెంటనే విస్టా ప్రాజెక్టు నిలిపివేసే ఆ నిధులతో వ్యాక్సిన్ కొరతను తీర్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని అంటూ కోరాయి.


 కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ లు ఏకమై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.  విపక్షాలు రాసిన లేఖలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో వీలైన అన్ని అవకాశాలను వినియోగించుకుని వ్యాక్సిన్ నిల్వలను పెంచుకోవడం. ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టాలి.  దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే విధంగా నిబంధనలు సవరించాలి.  వ్యాక్సిన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లు ఖర్చు చేయాలి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తక్షణం నిలిపివేసి.. ఆ నిధులను వ్యాక్సిన్, ఆక్సిజన్, వైద్య పరికరాలకు కేటాయించాలి. పీఎం కేర్స్ ఫండ్‌ నిధులను పూర్తిగా విడుదల చేసి కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలి. నిరుద్యోగులకు నెలకు రూ.6 వేలు చెల్లించాలి.  పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలి. రైతు చట్టాలను రద్దు చేయాలి అంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: