...
అయితే ఎప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి ముందుంటే రెడ్ క్రాస్ సొసైటీ ప్రస్తుత కరోనా సమయంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడంలో ముందు ఉంటుంది. ఇక ఇటీవలే మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ వారి విరాళంతో రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖ 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మిషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఆక్సిజన్ అవసరమైనవారికి ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు సిద్ధమయ్యారు.
ఆక్సిజన్ అవసరం అయిన వారు 18004251234 వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు అందించాల్సిందిగా కోరారు ప్రస్తుతం కరోనా సమయంలో రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతం చేస్తుందని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం 1000 ఆక్సిజన్ మిషన్లను ప్రజల కోసం అందుబాటులో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాము అంటూ తెలిపారు ఇక దాతల సహకారంతో ఇక కరోనా రోగులు అందరికీ మరిన్ని రకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు అయితే కరోనా రోగులకు రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ప్రశంసలు కురిపించారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి