గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్. ఇప్పటికీ కొన్ని దేశాలలో  ఇది తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది దశల వారీగా మానవ జాతిపై తన తీవ్రతను చూపుతూ ఉంది. మొదటి దశలో కరోనా కారణంగా ఎక్కువగా వృద్ధులు దీని బారిన పడ్డారు. రెండవ దశలో అయితే ఇది ఎక్కువగా యువకులపై మరియు 45 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారిపై ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే రెండవ దశ కొనసాగుతూ ఉన్నప్పటికీ, కేసులు సంఖ్య భారీగా తగ్గింది. రికవరీల సంఖ్య కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇంకా దేశంలో చాలా మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, దానికి ఇంకా కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. ఇది అంతా ఇలా ఉంటే రెండవ దశ కరోనా ముగియనుండగా కరోనా వైద్య నిపుణులు మరియు శాస్త్ర వేత్తలు రానున్న కరోనా మూడవ దశ గురించి గత కొద్ది రోజుల నుండి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. 

పైగా ఈ దశలో కరోనా ఎక్కువగా చిన్న పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని తన తీవ్రతను చూపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు సంబంధించి అన్ని చర్యలను వేగవంతంగా చేపట్టారు.   రోజూ కరోనా థర్డ్ వేవ్ గురించి వస్తున్న ఈ వార్తలను చూస్తున్న పేరెంట్స్ భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం పిల్లల తల్లితండ్రులకు ఊరట కలిగించే విధంగా ఉంది.  లాన్సెంట్ చెబుతున్న ప్రకారం అందరూ అనుకుంటున్నట్లుగా కరోనా మూడవ దశ పిల్లలపై అంత ప్రభావం చూపకపోవచ్చని తెలిపింది. పిల్లలపై కరోనా ప్రభావం పై ది లాన్సెంట్ కొవిడ్ మిషన్ పేరుతో ఒక నివేదికను తయారుచేసింది. ఈ నివేదికలో పిల్లలపై కరోనా ప్రభావం ఉంటుందన్నది వాస్తవం కాదని ఈ నిపుణులు చెబుతున్నారు.

కరోనా అందరితో పాటు వారిపై కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.  వీరు ముందుగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఢిల్లీ రాష్ట్రాలలో ఎన్ సి ఆర్ పరిధిలోని హాస్పిటల్స్ లో పిలల్లపై జరిపిన సర్వే ప్రకారం ఈ విషయాలను వెల్లడించారు.  ఈ టీమ్ లో  చిన పిల్లల వైద్య నిపుణులు ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఏమైనప్పటికీ పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా డాక్టర్ ల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్సను తీసుకోవచ్చు. ఈ నివేదిక తల్లితండ్రులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నా, ఏ మాత్రం  నిర్లక్ష్యం వహించవద్దని మరి కొందరు కరోనా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: