ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆస్ప‌త్రుల్లో నిర్ల‌క్ష్యం ఏ స్థాయిలో ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల ప‌రిస్థితి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ అస‌లు సౌక‌ర్యాలేమీ బాగుండ‌వు. ఈ క‌రోనా వ‌చ్చాక ఆస్ప‌త్రుల్లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై ఇప్ప‌టికే చాలామంది చాలా ర‌కాల ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. మ‌న‌కు కూడా సోష‌ల్ మీడియాలో ఎన్నో ఘ‌ట‌న‌లు క‌నిపిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రుల్లో వైద్య సేవ‌లు అంద‌క చాలామంది చ‌నిపోతూనే ఉన్నారు. కొన్ని సార్లు చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ఇందుకు కార‌ణాలుగా ఉన్నాయి. ఇక ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో చాలామంది ప్రాణాలో కూడా కోల్పోతున్నారు. ఇక ప్ర‌స్తుతం ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొకటి చోటుచేసుకుంది. కాక‌పోతే అది ఆదిలాబాద్‌లో జ‌రిగింది.

ఆదిలాబాద్ లోగ‌ల‌ రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అక్క‌డి సిబ్బంది, డాక్ట‌ర్లు. ఆస్ప‌త్రికి వ‌చ్చే పేషెంట్ల‌కు గడువు తీరిపోయిన మందులను ఇస్తున్నారు. అలాగే సీరియ‌స్‌గా ఉన్న పేషెంట్ల‌కు ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఎక్స్ పైర్ డేట్ అయిపోయిన‌వి ఇస్తున్నారు. తాజాగా 2021 జనవరిలో గడువు తీరిన మందులను పలువురికి ఇంజెక్షన్ చేశారు రిమ్స్ వైద్య సిబ్బంది.

జిల్లా కేంద్రంలోని కోలిపుర కాలనీకి చెందిన గౌరీశంకర్ అనే సాదారణ వ్యక్తి కొంచెం అనారోగ్యంగా ఉండ‌టంతో రిమ్స్ లో చేరాడు. అయితే ఆయ‌న‌కు గడువు తీరిపోయిన ఇంజెక్షన్ చేశారు వైద్య సిబ్బంది. దీంతో ఇది గమనించి బాధితుడి సంబంధీకుడు కైలాష్.. వెంట‌నే న‌ర్సును ప్ర‌శ్నించ‌చారు. మిగ‌తా పేషెంట్ల వ‌ద్ద ప‌రిశీలించ‌గా అవన్నీ కూడా గడువు తీరిపోయినవే కావటంతో నర్స్ అల‌ర్ట్ అయింది. గొడ‌వ పెద్ద‌ద‌వ‌డంతో ఇంజెక్షన్లన్నింటినీ డస్ట్ బిన్ లో పడేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం పై అడిగినా.. రిమ్స్ డైరెక్టర్ బల‌రాం నాయక్ స్పందించ‌లేదు. గడువు తీరిపోయినవి ఇస్తే బాధ్యులెవరని పేషెంట్లు ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: